ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (జూలై 20) తిరుపతిలో పర్యటించనున్నారు. ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమానికి అంకితం చేస్తూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించే ముఖ్యమంత్రి, ఈసారి తిరుపతిని ఎంచుకున్నారు. ఉదయం విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరి, ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తూకివాకం గ్రామానికి వెళ్లి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించనున్నారు. తర్వాత మధ్యాహ్నం 12:15 గంటలకు కపిలతీర్థం వద్ద కపిలేశ్వరస్వామిని దర్శించి, స్వచ్ఛాంధ్ర కార్యక్రమ భాగస్వాములతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:45 వరకు పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు అలిపిరిలోని కంచి కామకోటి పీఠాన్ని సందర్శించి, అక్కడి స్వాములతో భేటీ అవుతారు.
ఈ పర్యటన అనంతరం తిరుగు ప్రయాణం కానున్నారు. సీఎం కార్యాలయం ఇప్పటికే పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ పర్యటనకు సంబంధించి తిరుపతిలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Read More : సైబర్ మోసాలపై కఠిన చట్టాలు! : RRK

One thought on “స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం”
Comments are closed.