యాంకర్‌ను అరెస్ట్ చేయడమేంటీ? జగన్ ఆగ్రహం

ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌పై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. “ఒక టీవీ డిబేట్ జరుగుతున్న సమయంలో వక్తలు ఏమి మాట్లాడుతున్నారో దానికి యాంకర్‌కి ఎలాంటి సంబంధం?” అని ప్రశ్నించారు. డిబేట్‌ వేదికపై మాట్లాడిన మాటల కోసం యాంకర్‌ను అరెస్ట్ చేయడం ఏ విధమైన న్యాయం అని జగన్ విమర్శించారు.

“ఈరోజు మీరు ఏమి చేస్తున్నారో.. రేపు దానికి రెట్టింపు జరుగుతుందని మర్చిపోకండి” అంటూ అధికారాన్ని వినియోగించుకుంటూ జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు.

“కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు కేవలం ఆయన వ్యక్తిగతపైనే కాదు.. ఇది మీడియా స్వేచ్ఛపై దాడి” అని జగన్ పేర్కొన్నారు.

“ఇది కక్షసాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లిన చర్య. విభిన్నాభిప్రాయాలపై భయపడి అరెస్టులు చేయడం వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం వాటిల్లుతుంది” అని పేర్కొన్నారు.

Read More : టెన్త్ టాపర్లకు షైనింగ్ స్టార్స్ అవార్డులు

One thought on “యాంకర్‌ను అరెస్ట్ చేయడమేంటీ? జగన్ ఆగ్రహం

Comments are closed.