గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్ అక్రమాలకు సంబంధించిన అంశంపై గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు అక్రమ తవ్వకాలపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను గన్నవరం పోలీసులకు అందించారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో వంశీ, ఆయన అనుచరులు భారీ స్థాయిలో మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డట్లు అధికారులు తెలిపారు. మొత్తం రూ.100 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించిన గనుల శాఖ, ఇందుకు సంబంధించి సరైన ఆధారాలతో ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు ఆధారంగా గన్నవరం పోలీసులు వల్లభనేని వంశీపై కేసు నమోదు చేశారు. పిటి వారెంట్ కోసం కోర్టులో దరఖాస్తు చేసేందుకు చర్యలు ప్రారంభించారు.
ఇప్పటికే వంశీ వివిధ కేసుల్లో అరెస్టై జైలులో ఉన్న విషయం తెలిసిందే. తాజా కేసుతో ఆయనపై నమోదైన నేరాల సంఖ్య మరింత పెరిగినట్లైంది.
Read More : వాతావరణ శాఖ హెచ్చరిక
