వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ స్టాండ్ ప్రారంభం..

ముంబయిలోని ప్రముఖ వాంఖడే స్టేడియంలో నేడు ఒక ప్రత్యేక ఘట్టం ఆవిష్కృతం కానుంది. టీమిండియా మాజీ కెప్టెన్, ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మకు గౌరవంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాండ్‌ ఈరోజు నుంచి అభిమానులకోసం అందుబాటులోకి రానుంది.

భారత క్రికెట్‌కు, ముంబయి క్రికెట్‌కు రోహిత్ చేసిన సేవలను గుర్తించిన వాంఖడే స్టేడియం యాజమాన్యం, ఈ స్టాండ్‌కు ‘హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ స్టాండ్’ అనే పేరును పెట్టింది. ఈ సందర్భంగా ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ ఒక స్పెషల్ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ వీడియోలో రోహిత్ విజయాలను, ఎమోషనల్ మూమెంట్లను చూపిస్తూ అభిమానుల గుండెల్లోకి చేరింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More : చిన్నస్వామి మైదానం చెరువుగా మారిన వీడియో వైరల్.