శర్వానంద్ కుటుంబంతో ఆలయ దర్శనం: కూతురు లీలా దేవితో మధుర క్షణాలు

Sharwanand Family Temple Visit

చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన భార్య రక్షితా రెడ్డి, కుమార్తె లీలా దేవితో కలిసి విజయవాడ కనక దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఇంద్రకీలాద్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన శర్వా, అనంతరం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకున్నారు. అక్కడ తన కుమార్తె లీలా దేవితో ప్రత్యేక పూజలు చేసి పుట్టు వెంట్రుకలు తీయించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

2023 జూన్‌లో రక్షితా రెడ్డితో వివాహం చేసుకున్న శర్వానంద్, గత ఏడాది పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమెకు లీలా దేవి మైనేని అని పేరు పెట్టారు. ప్రస్తుతం “నారి నారి నడుమ మురారి” సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న శర్వానంద్, మరో రెండు ప్రాజెక్టులతో కూడా తీరికలేకుండా ఉన్నాడు. ఫ్యామిలీతో కలిసి ఆలయ సందర్శన చేసిన ఫోటోలను చూసి అభిమానులు, నెటిజన్లు లీలా దేవి క్యూట్‌గా ఉందంటూ ప్రశంసిస్తున్నారు.

వివాహం తర్వాత సినిమాలను తగ్గించిన శర్వానంద్, గతేడాది వచ్చిన “మనమే” చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా యావరేజ్‌గా నిలిచినప్పటికీ, ప్రస్తుతం నూతన ప్రాజెక్ట్‌లతో శర్వా మళ్లీ ఫుల్‌ బిజీగా మారాడు. చార్మింగ్ స్టార్ శర్వానంద్ కుటుంబంతో ఆలయ సందర్శన చేసిన ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

Read More

One thought on “శర్వానంద్ కుటుంబంతో ఆలయ దర్శనం: కూతురు లీలా దేవితో మధుర క్షణాలు

Comments are closed.