ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గంగ రివర్ను రక్షించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. గంగా నది తీరంలో 200 మీటర్ల పరిధిలో నిర్మాణాలకు నిషేధం విధించనుంది. త్వరలో ప్రకటించనున్న బిల్డింగ్ బైలాజ్‌ల ప్రకారం, పాత భవనాలకు మరమ్మతులు, పునర్నిర్మాణానికి మాత్రమే అనుమతి ఇస్తారు.
ఆష్రమాలు, మందిరాలు, మఠాల నిర్మాణానికి కొంత పరిమితులతో అనుమతి ఇవ్వనున్నారు. భవన యజమానులు గంగా కాలుష్యాన్ని నివారించేందుకు హామీ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి, యూపీ ప్రభుత్వం రూపొందించిన రంగాల విధానాల ప్రకారం FAR, భవన ఎత్తు పరిమితులు అనుసరించి మ్యాప్ ఆమోదం లభించనుంది.
Read More : బంగ్లాదేశ్‌లో హిందూ నేతను కిడ్నాప్ చేసి దారుణ హత్య — తీవ్ర ఉద్రిక్తత!
