ఉత్తర కన్నడ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంగళూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి కాలువలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో హుబ్బళ్లికి చెందిన ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన అగసుర్ గ్రామ సమీపంలో జరిగింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న రెస్క్యూ టీమ్ వెంటనే అక్కడకు చేరుకుని, క్రేన్ సాయంతో బస్సును బయటకు లాగారు. తాళ్ల సాయంతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. ప్రాథమికంగా రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించబోయిన డ్రైవర్ వంతెన గోడను ఢీకొనడంతో బస్సు అదుపుతప్పిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది.
Read More : ముంబై రన్వే పై తృటిలో తప్పిన ప్రమాదం

One thought on “వంతెనపై నుంచి బస్సు కాలువలోకి పడిన ఘటన”
Comments are closed.