హైదరాబాద్‌లో ఓ వైపు భీభత్సమైన ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కి చేస్తుండగా, మరోవైపు వర్షాలు అలజడికి గురి చేశాయి. ఉదయం నుంచి సూర్యుడు తీవ్రమైన వేడిని ప్రసాదిస్తుంటే, మధ్యాహ్నం తర్వాత వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉన్నట్టుండి వర్షాలు ప్రారంభమయ్యాయి, వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది.
వర్షపు నీరు రోడ్లపై చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయారు. బలమైన ఈదుగాలులతో పెద్ద వృక్షాలు నేలరాలాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, రాజ్‌భవన్ రోడ్, లక్డీకాపూల్, ఉప్పల్, సికింద్రాబాద్, నాంపల్లి, కోటి, ఆబిడ్స్ ఇలా అనేక ప్రాంతాల్లో వర్షం కురిసింది.
మహారాష్ట్ర నుంచి మన్నార్ గల్ఫ్ వరకు మరాఠ్వాడ, కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి కిలోమీటర్ ఎత్తులో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతోనే హైదరాబాద్‌లో ఏకధాటిగా వర్షం కురిసింది. వర్షపాతం దాదాపు 8 సెంటీమీటర్లకు పైగా నమోదైంది. వాతావరణ శాఖ ప్రస్తావించినట్లు, మరో నాలుగు ఐదు రోజులు ఈ పరిస్థితి కొనసాగవచ్చని సూచించింది. ఉదయం ఎండ తీవ్రత ఉంటుందనగా, సాయంత్రానికి వర్షం కురిసే అవకాశం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

One thought on “హైదరాబాద్‌లో ఎండ తర్వాత వర్షం: ట్రాఫిక్ జామ్‌లు..”
Comments are closed.