టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు వాంఖడేలో అరుదైన గుర్తింపు..

తాను వాంఖడే స్టేడియంలోకి ప్రవేశించిన తొలి రోజు నుంచి అదే స్టేడియంలో ఒక స్టాండ్ కు తన పేరు పెట్టేంత వరకు జీవితంలో ఎన్నో జరిగాయని రోహిత్ అన్నాడు. అజాద్ గ్రౌండ్ లో తాము అండర్ 14, అండర్ 16 ట్రైనింగ్ పూర్తి చేసుకుని రంజీ క్రికెటర్లను చూసేందుకు వాంఖడేకి వెళ్లేవాళ్లమని తెలిపాడు. అప్పట్లో వాంఖడేలోకి వెళ్లడం ఎంత కష్టమో తనకు తెలుసని చెప్పాడు. ఆ రోజులను ఎప్పుడూ గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. తన తొలి గేమ్ ను వాంఖడేలోనే ఆడానని… ఆ తర్వాత ఎన్నో మరుపురాని మ్యాచ్ లు ఆడానని చెప్పాడు.

ముంబై వాంఖడే స్టేడియంలోని ఓ స్టాండ్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై రోహిత్ శర్మ స్పందిస్తూ… తాను ఆడే స్టేడియంలోని స్టాండ్ కు తన పేరు పెట్టడం అనేది నిజంగా నమ్మలేకపోతున్నానని చెప్పాడు. తన జీవితంలో ఇది అతిపెద్ద గౌరవం అని అన్నాడు.

One thought on “టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు వాంఖడేలో అరుదైన గుర్తింపు..

Comments are closed.