2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పార్టీ తరఫున నటుడు విజయ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది టీవీకే పార్టీ. ఈ మేరకు పార్టీ కార్యవర్గ సమావేశంలో అధికారికంగా తీర్మానం చేయడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ సందర్భంగా టీవీకే పార్టీ స్పష్టం చేసింది – రానున్న ఎన్నికల్లో ఎటువంటి రాజకీయ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా (సింగిల్‌గా) బరిలోకి దిగుతామని. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో విజయం సాధించడమే తమ లక్ష్యమని పేర్కొంది.
విజయ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా టీవీకే తన రాజకీయ ప్రస్థానాన్ని మరింత బలపరుస్తోంది.
Read More : బెంగళూరులో విద్యార్థిని ఢీకొట్టిన బస్సు..

One thought on “సీఎం అభ్యర్థిగా ప్రకటించిన టీవీకే పార్టీ”
Comments are closed.