బెంగళూరులో విద్యార్థిని ఢీకొట్టిన బస్సు..

బెంగళూరులో ఓ విద్యార్థి రోడ్డు దాటే క్రమంలో బస్సు ఢీకొట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపుతున్నాయి. స్కూల్ బస్సును అందుకోవాలనే ఆవేశంలో పరిగెడుతూ వచ్చిన విద్యార్థి… ట్రాఫిక్‌ను గమనించకుండానే రోడ్డుపైకి ప్రవేశించగా, అదే సమయంలో వచ్చిన బీఎంటీసీ (BMTC) బస్సు అతడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. వివరాల్లోకి వెళ్తే… బెంగళూరులో 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఉదయం కాలేజీకి వెళ్లే ప్రయత్నంలో కాలేజీ వ్యాన్ కోసం వేచి చూస్తూ ఉండగా… అది ఎదురుగా రావడంతో వాహనాలను చూడకుండానే రోడ్డు దాటేందుకు పరిగెత్తాడు. ఆ సమయంలో ఎదురుగా వచ్చిన బీఎంటీసీ బస్సు వేగంగా వచ్చి అతడిని గుద్దింది. అక్కడే ఉన్న పలువురు వ్యక్తులు వెంటనే స్పందించి అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఎంతటి ప్రమాదాలు సంభవించవచ్చో ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది.

Read More : స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం…

One thought on “బెంగళూరులో విద్యార్థిని ఢీకొట్టిన బస్సు..

Comments are closed.