డిప్యూటీ ఆర్మీ చీఫ్ రాహుల్ ఆర్ సింగ్ ప్రకటన

న్యూఢిల్లీ: భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్, చైనా, టర్కీ దేశాలు ఒకేసారి యుద్ధాత్మకంగా ముందుకు వచ్చాయని, దేశ రక్షణ కోసం భారత సైన్యం మూడింటినీ సమర్థంగా ఎదుర్కొంది అని డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (DCOAS) లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ వెల్లడించారు. ఒపరేషన్ ‘సిందూర్’ సమయంలో చోటుచేసుకున్న పరిణామాల గురించి వివరిస్తూ, “పాకిస్థాన్‌కు ఎరిపడిన ఆయుధాల వ్యవస్థలో 81 శాతం వరకు చైనా నుంచే సమకూరింది. చైనా అందించిన ఆ సాంకేతిక వనరులు, డ్రోన్లు, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు మనపై యుద్ధానికి వినియోగించబడ్డాయి. అంతేకాదు, టర్కీ కూడా పాక్‌కు కావలసిన సాయాన్ని అందించింది. ఇలా ఒకే సరిహద్దులో మూడింటికీ మన సైన్యం ధైర్యంగా తలపడింది,” అని ఆయన అన్నారు.

భారత్‌ భద్రతను దెబ్బతీయాలనే దురుద్దేశంతో ఈ మూడు దేశాలు కలిసి వ్యూహాత్మకంగా పని చేశాయని రాహుల్ ఆర్ సింగ్ స్పష్టం చేశారు. అయితే భారత సైన్యం అప్రమత్తంగా ఉండటం వల్ల ఆ కుట్రలను సమర్థంగా అడ్డుకున్నామని వివరించారు. భారత్ భద్రతతో పాటు, ప్రజల మద్దతు, ఆత్మవిశ్వాసం కూడా ఈ పోరాటంలో కీలకపాత్ర పోషించాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ వివరణల నేపథ్యంలో భారత్ భద్రతాపరంగా ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రజలు అర్థం చేసుకోవాలని, దేశ సైన్యానికి అండగా నిలవాలన్న విజ్ఞప్తిని ఆయన చేశారు.

Read More : సీఎం అభ్యర్థిగా ప్రకటించిన టీవీకే పార్టీ