భారత్‌పై సుంకాలు పెంచనున్న ట్రంప్

భారత్‌పై మరిన్ని సుంకాలు (టారిఫ్‌లు) విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే 25 శాతం ప్రతీకార సుంకాలు అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో, అదనంగా కొత్త సుంకాలు విధించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్‌’లో వెల్లడించారు. భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేసి, బహిరంగ మార్కెట్‌లో విక్రయించడం ద్వారా లాభాలు ఆర్జిస్తోందని ట్రంప్ ఆరోపించారు. రష్యాకు భారత్ చేస్తున్న ఈ ఆర్థిక సహకారం కారణంగానే ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోందని విమర్శించారు. “ఉక్రెయిన్‌లో జరుగుతున్న ప్రాణనష్టం వారిని పట్టించుకోవడం లేదు” అని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇకపోతే, ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వదేశీ ఉత్పత్తుల ప్రాధాన్యతను మరోసారి గుర్తు చేశారు. వారణాసిలో జరిగిన సభలో మాట్లాడుతూ, “ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా మారింది. ప్రతి దేశం తన ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోంది. భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి వేగంగా పయనిస్తోంది. ఇలాంటి సమయంలో మనం స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి” అని మోదీ పిలుపునిచ్చారు.

Read More : USA – రష్యా ఆయిల్ కొనుగోలు ద్వారా యుద్ధానికి భారత్ మద్దతు ఇస్తోందా?

One thought on “భారత్‌పై సుంకాలు పెంచనున్న ట్రంప్

Comments are closed.