‘బిగ్‌బాస్’ రియాలిటీ షోలో అవకాశం ఇప్పిస్తానని నమ్మబలికిన ఒక వ్యక్తి, భోపాల్‌కు చెందిన ప్రముఖ చర్మవ్యాధి నిపుణుడిని లక్షల్లో మోసగించాడు. ఈ ఘటన వెలుగులోకి రాగానే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వివరాల్లోకి వెళ్తే, భోపాల్‌లో ‘పాయిజన్ స్కిన్ క్లినిక్’ నిర్వహిస్తున్న డాక్టర్ అభినిత్ గుప్తాను 2022లో కరణ్ సింగ్ అనే వ్యక్తి సంప్రదించాడు. తాను ఈవెంట్ డైరెక్టర్‌నని, టీవీ నిర్మాణ సంస్థలతో బలమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి, బిగ్‌బాస్ షోలో ఆయనకు అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చాడు. ఈ నమ్మకంతో డాక్టర్ గుప్తా కరణ్‌కు రూ.10 లక్షలు చెల్లించారు.
అయితే, బిగ్‌బాస్ కంటెస్టెంట్ల జాబితా విడుదల కాగా, అందులో డాక్టర్ గుప్తా పేరు లేకపోవడంతో ఆయన కరణ్‌ను నిలదీశారు. ‘బ్యాక్‌డోర్ పద్ధతి’ ద్వారా అవకాశం వస్తుందని చెప్పి కరణ్ తప్పించుకున్నాడు. ఆ తర్వాత డాక్టర్ ఫోన్ కాల్స్ ఎత్తడం మానేసి, చివరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.
డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసినా స్పందన లేకపోవడంతో డాక్టర్ గుప్తా పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం పోలీసులు మోసం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More : గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఢిల్లీలో పర్యటన

One thought on “బిగ్‌బాస్ అవకాశం పేరుతో వైద్యుడికి రూ.10 లక్షల మోసం”
Comments are closed.