మేడ్చల్ పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు పెద్ద ఎత్తున విజృంభించాయి. ఈ ఘటనలో రోడ్డుపై నడుస్తున్న వ్యక్తి మృతి చెందగా, ఇంట్లో ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Read More : కాళేశ్వరం పై హరీష్ రావు వీడియో ప్రజెంటేషన్

One thought on “మేడ్చల్‌లో గ్యాస్ సిలిండర్ పేలుడు”
Comments are closed.