ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంటోనీ ఆల్బనీస్ ఓ కార్యక్రమంలో అపశ్రుతికి గురయ్యారు. ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపిన ఆయన స్టేజ్‌పై నడుస్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి కింద పడిపోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడే ఉన్న అధికారులు, భద్రతా సిబ్బంది ఆయనను పైకి లేపారు. అనంతరం ఆల్బనీస్ నవ్వుతూ చేతులు ఊపుతూ తాను క్షేమంగా ఉన్నానని తెలిపారు. ప్రధానికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అక్కడున్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ ప్రమాదవశాత్తు కిందపడటం.
Share This

One thought on “ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ ప్రమాదవశాత్తు కిందపడటం.”
Comments are closed.