శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కుడితిపాళెం గ్రామంలోని కాకర్లదిబ్బలో మానవత్వాన్ని మరిచే దారుణ ఘటన చోటుచేసుకుంది. సెల్‌ఫోన్ దొంగలించిందన్న అనుమానంతో 10 ఏళ్ల గిరిజన బాలికపై నలుగురు దుండగులు అమానుషంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఆ బాలికను విచక్షణారహితంగా కొట్టిన దుండగులు, అట్లకాడ కాల్చి మూతిపై గాయాలు కలిగించడంతో పాటు నాలుకపై వేడి వత్తులు పెట్టినట్టు సమాచారం. ఈ దాడితో చిన్నారి తీవ్రంగా గాయపడినట్లుగా స్థానికులు చెబుతున్నారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించాలని చర్యలు చేపట్టారు. ఘటనపై నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read More : యోగాంధ్ర కార్యక్రమంలో వసతులపై మహిళల అసంతృప్తి

One thought on “10 ఏళ్ల గిరిజన బాలికపై దాడి చేసిన నలుగురు దుండగులు”
Comments are closed.