గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని ప్రధాన రహదారులు పూర్తిగా నీటితో మునిగిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అనేక ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడగా, చిన్న వాహనాలే కాదు, బస్సులు, ఆటోలు కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాహనాలు జలాల్లో చిక్కుకుపోయిన దృశ్యాలు కనిపించాయి.వర్షం ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లే వారు కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Read More : మేక్ ఇన్ ఇండియా పూర్తిగా విఫలమైందన్న రాహుల్ గాంధీ

One thought on “గుజరాత్‌లో భారీ వర్షాలు”
Comments are closed.