టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా లండన్ వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే లండన్ బయల్దేరారు. ‘పెద్ది’ సినిమా షూటింగ్‌కు తాత్కాలిక విరామం రావడంతో, చరణ్ లండన్ వెళ్లి వెకేషన్ ఎంజాయ్ చేయడంతో పాటు అక్కడ ఓ ప్రముఖ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. ఈ ఈవెంట్‌లో ‘ఆర్ ఆర్ ఆర్’కి సంబంధించిన స్పెషల్ స్క్రీనింగ్ జరగనుంది.
ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా హాజరవుతున్నారు. ప్రస్తుతం ‘డ్రాగన్’ సినిమా షూటింగ్‌లో ఉన్న ఎన్టీఆర్, ప్రత్యేకంగా ఈ ఈవెంట్ కోసం షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. కాగా ఈవెంట్‌కు దర్శక ధీరుడు రాజమౌళి కూడా హాజరవుతుండటంతో, ‘ఆర్ ఆర్ ఆర్’ ముగ్గురూ ఒకేసారి లండన్‌లో కనిపించనున్నారు.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబూ ఇటీవల తన ‘ఎస్ ఎస్ ఎంబీ 29’ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి విదేశీ ప్రయాణానికి వెళ్లారు. తాజా సమాచారం ప్రకారం, ఆయన కూడా అదే లండన్ ఈవెంట్‌కు హాజరవుతారని తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ ముగ్గురు సూపర్ స్టార్‌లు ఒకేసారి లండన్ బాట పట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇప్పటి వరకు ఎవరు వెకేషన్‌కి వెళ్లినా ఒక్కో దేశంలో ఉండేవారు. కానీ ఈసారి మాత్రం చరణ్, తారక్, మహేష్ ఒకేసారి లండన్‌లో కనిపించబోతుండటంతో ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

One thought on “టాప్ స్టార్స్ లండన్ వెకేషన్‌లో సందడి!”
Comments are closed.