ఘట్టమనేని వారసుడి ఎంట్రీకి గ్రాండ్ ప్లాన్.. బోల్డ్ డైరెక్టర్‌తో సినిమా!

Jayakrishna Ghatthamaneni debut film

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసుడు సినీ రంగ ప్రవేశానికి రెడీ అవుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌ను ‘RX100’, ‘మంగళవారం’ వంటి బోల్డ్ సినిమాలతో గుర్తింపు పొందిన దర్శకుడు అజయ్ భూపతి డైరెక్ట్ చేయనున్నారని సమాచారం. ప్రస్తుతం ‘మంగళవారం 2’లో బిజీగా ఉన్నా, ఈ కొత్త చిత్రాన్ని కూడా లైన్‌లో పెట్టినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమాను ఇద్దరు ప్రముఖ నిర్మాతలు కలిసి నిర్మించనుండగా, జయకృష్ణ లండన్‌లో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుంటూ డెబ్యూ కోసం సిద్ధమవుతున్నాడు. కథా వివరాలు ఇంకా బయటకు రాలేదు కానీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కారణంగా అంచనాలు భారీగానే ఉన్నాయి.

ముఖ్యంగా మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్‌లో కీలకంగా ఇన్‌వాల్వ్ అవుతున్నాడని సమాచారం. నిర్మాణంలో పలు అంశాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారట. మొత్తానికి ఘట్టమనేని వారసుడి ఎంట్రీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

Read More



One thought on “ఘట్టమనేని వారసుడి ఎంట్రీకి గ్రాండ్ ప్లాన్.. బోల్డ్ డైరెక్టర్‌తో సినిమా!

Comments are closed.