నటసింహ బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ 2 శివతాండవం’ ఈ దసరా సీజన్‌లో విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకలోనే దసరా రిలీజ్ స్పష్టత ఇచ్చారు. దీంతో ఈ పండుగ సీజన్‌లో బాలయ్య సినిమా ప్రధాన హైలైట్‌గా నిలిచింది.
అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ పోటీలోకి దిగనున్నట్లు సమాచారం. చిరు కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యం వల్ల విడుదల వాయిదా పడింది. అయితే ఇప్పుడు దసరా రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఈ పరిణామాలతో దసరా బరిలో చిరు, బాలయ్యల మధ్య మళ్లీ బిగ్ వార్ నెలకొనబోతోంది. ఇద్దరి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే అభిమానుల మధ్య హీట్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు సంక్రాంతి రేసుల్లో తలపడిన వీరు ఈసారి దసరా బరిలోకి దిగుతుండడం విశేషం.
ఇండస్ట్రీకి వచ్చి సిల్వర్ జూబ్లీ పూర్తి చేసిన బాలయ్య ఈ వార్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారట. దసరాకి తమ సినిమానే పెద్ద హిట్ చేయాలని భావించి ఎంతటి కాంపిటీషన్‌కైనా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి మెగా-నందమూరి ఫ్యాన్స్ మధ్య భారీ పోటీ చూడొచ్చేమో.

One thought on “దసరాకు బాలయ్య Vs చిరు బిగ్ వార్!”
Comments are closed.