బిటెక్ రవి ఆగ్రహం: “వైసీపీ నేతలు సంస్కృతి మరిచారు”

వైసీపీ నేతలు అంజాద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డిల వ్యాఖ్యలు అసంబద్ధంగా మరియు సంస్కృతికి విరుద్ధంగా ఉన్నాయని పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ బిటెక్ రవి తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన, “రప్పా రప్పా” అంటూ బెదిరింపులకు దిగే రోజులు పోయాయని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తనను కిడ్నాప్ చేసి హత్య చేయాలని కూడా ఆ పార్టీ నేతలు కుట్ర పన్నారని ఆరోపించారు. అయితే, మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన విషయాల వల్లే తాను బతికి బయటపడ్డానని ఆయన వివరించారు.

మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైనవని, ఏడాది కాలంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అనేక హామీలను నెరవేర్చిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు ప్రస్తుతం సంతృప్తిగా ఉన్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ మద్యం వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారన్న బిటెక్ రవి, ప్రస్తుతం రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు.

వైసీపీ నేతల “రప్పా రప్పా” వ్యాఖ్యలు తీవ్రంగా ఖండనీయమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని హెచ్చరించారు.

Read more : తిరుపతిలో సైకో వ్యక్తి వీరంగం: ఒకరు మృతి, ఇద్దరు గాయపాటు

One thought on “బిటెక్ రవి ఆగ్రహం: “వైసీపీ నేతలు సంస్కృతి మరిచారు”

Comments are closed.