అమరావతి: రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఫలితాలు వచ్చేశాయి. ఏపీ ప్రభుత్వం శనివారం (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.
ఫలితాలు పొందేందుకు విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in ద్వారా లేదా ‘మన మిత్ర’ సేవల నెంబర్ 9552300009కు “హాయ్” అని సందేశం పంపడం ద్వారా తెలుసుకోవచ్చని మంత్రి తెలిపారు.
ఈ ఏడాది మొదటి మరియు ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు 10 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల కోసం విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Read More : LEAP పథకం ప్రారంభంపై నారా లోకేష్ కీలక ప్రకటన

One thought on “ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు రేపే విడుదల”
Comments are closed.