తిరుమలలో టీటీడీ అధికారుల నిర్లక్ష్యం.. చెప్పులతో ఆలయానికి వెళ్లిన భక్తులు!

ttd

తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ అధికారుల నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. పాదరక్షలు వేసుకున్న భక్తులు ఆలయ మహాద్వారం వరకు బేధభావం లేకుండా ప్రవేశించిన ఘటనపై ప్రస్తుతం తీవ్ర చర్చ నెలకొంది.

వాస్తవానికి, భక్తులు చెప్పులు వేసుకొని ఆలయ ప్రాంగణంలోకి రావడం క్రమశిక్షణలకు వ్యతిరేకం. అయితే విజిలెన్స్ మరియు టీటీడీ సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతో భక్తులు పాదరక్షలతోనే ఆలయానికి దగ్గరగా చేరుకోవడం చోటుచేసుకుంది.

ఈ ఘటనను గమనించిన ఇతర భక్తులు, సిబ్బందిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆలయ పరిశుద్ధతను కాపాడాల్సిన భాద్యత టీటీడీ అధికారులపై ఉన్నా, వారి నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాదరక్షలతో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఘటనపై టీటీడీ అధికారులు సీరియస్‌గా స్పందించి, భవిష్యత్‌లో ఇలాంటి అవాంఛనీయ పరిణామాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Read More : పవన్ కల్యాణ్ కుమారుడిని కాపాడిన భారతీయులకు సింగపూర్ ప్రభుత్వ సత్కారం