బ్రేకింగ్ న్యూస్ : నెల్లూరు జిల్లా టీజీ గూడూరు మండలం అనంతపురంలో అమోనియా గ్యాస్ లీక్ కలకలం రేపింది. స్థానిక వాటర్ బేస్ ప్రైవేట్ కంపెనీలో అకస్మాత్తుగా అమోనియా గ్యాస్ లీక్ కావడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఒక్కసారిగా ఊపిరాడక అల్లకల్లోలానికి లోనయ్యారు.
లీక్ కారణంగా మొత్తం పరిశ్రమలో తీవ్ర గ్యాస్ దట్టించి, కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో దాదాపు 10 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అమోనియా గ్యాస్ సర్వత్ర వ్యాపించి పరిశ్రమ పరిసర గ్రామాలకు వ్యాపించడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. ప్రమాద స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

One thought on “నెల్లూరు జిల్లా అనంతపురంలో అమోనియా గ్యాస్ లీక్.”
Comments are closed.