తిరుమలలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. ఈస్ట్ బాలాజీ నగర్‌లోని బాల గంగమ్మ ఆలయం వద్ద చిరుత తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఈ రోజు ఉదయం చిరుతపులి ఆలయం సమీపంలో సంచరించడాన్ని గమనించిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఆలయం చుట్టూ తిరుగుతున్న చిరుత దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించాయి. ఈ సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయం వద్ద మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. చిరుతపులి సంచారంపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా తిరగవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Read More : వివేకా హత్యకేసు దర్యాప్తు పూర్తయిందని సీబీఐ స్పష్టం

One thought on “తిరుమలలో చిరుత సంచారం”
Comments are closed.