మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఈ కేసులో ఇక విచారణ చేయాల్సిందేమీ మిగల్లేదని, తమ తరఫున దర్యాప్తు ముగిసిందని సీబీఐ అధికారులు ధర్మాసనానికి తెలిపారు. జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరిపింది. విచారణ సందర్భంగా వివేకా కుమార్తె సునీత తరఫు సీనియర్ కౌన్సిల్ వేరే కోర్టులో ఉండటంతో, జూనియర్ లాయర్ విచారణ పాస్ ఓవర్ కోరారు.
సుప్రీంకోర్టు ఏమైనా ఆదేశాలు ఇస్తే వాటిని అమలు చేస్తామని సీబీఐ స్పష్టం చేసింది. వివేకా కేసుపై ఇవాళ (మంగళవారం) మరోసారి జస్టిస్ ఎంఎం సుందరేశ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
Read More : వివాహం జరిగిన రోజే నవవధువు ఆత్మహత్య

One thought on “వివేకా హత్యకేసు దర్యాప్తు పూర్తయిందని సీబీఐ స్పష్టం”
Comments are closed.