తిరుమల కొండపై మంగళవారం సాయంత్రం చిరుతపులి హల్చల్‌కు కారణమైంది. సాయంత్రం 4:10 గంటల సమయంలో అన్నమయ్య భవన్ సమీపంలో ఓ చిరుతపులి కనిపించింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉన్న భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించారు. సైరన్లు మోగించి చిరుతను తరిమివేయడంతో అది తిరిగి అడవిలోకి పరుగెత్తింది. అటవీ అధికారులు పరిస్థితిని సమీక్షించి భక్తుల భద్రతకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
తిరుమలలో ఇటీవల చిరుతపులి సంచారం పెరగడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఆలయ పరిసరాల్లో పటిష్టమైన నిఘా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read More : గోదావరిలో నీటి మట్టం పెరుగుతోంది

One thought on “తిరుమలలో చిరుతపులి హడావుడి”
Comments are closed.