తెలంగాణ ఆర్టీసీ టికెట్ ధరలు మళ్లీ పెంపు దిశగా

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ టికెట్ ధరలు మరోసారి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కిలోమీటర్ల సర్దుబాటు (రేషనలైజేషన్) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకోనుండటంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ ప్రాంతంలో పనిచేస్తున్న 11 డిపోల నుంచి రోజూ సుమారు 4.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇప్పటికే టోల్ ప్లాజాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రయాణానికి రూ.10 చొప్పున ఛార్జీలు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా 14 కిలోమీటర్ల స్టేజీని 15 కిలోమీటర్లగా మారుస్తూ, మరోసారి రూ.10 అదనంగా వసూలు చేయనున్నట్లు సమాచారం.

ఈ నిర్ణయంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఇప్పటికే టోల్ ఛార్జీల పేరిట ప్రతి టికెట్‌కు రూ.20 వరకూ అదనంగా చెల్లిస్తున్నాం. ఇప్పుడు కిలోమీటర్ల మార్పు పేరుతో మరోసారి ధరలు పెంచడమేం న్యాయం?” అని వారు ప్రశ్నిస్తున్నారు. ఉచిత బస్సు సేవల వల్ల ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక భారం ను సామాన్య ప్రజలపై మోపడం తగదని పలువురు అభిప్రాయపడుతున్నారు. “ఉచిత సౌకర్యం ఇచ్చి మళ్లీ చార్జీలు పెంచితే, అదంతా ఊహించని భారమే అవుతుంది” అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రస్తుతం ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. అధికారుల నిర్ణయంపై ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు స్పందించేలా మారిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read More : రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చిన రాజాసింగ్…

One thought on “తెలంగాణ ఆర్టీసీ టికెట్ ధరలు మళ్లీ పెంపు దిశగా

Comments are closed.