‘ది ప్యారడైజ్’లో విలన్‌గా టాలీవుడ్ లెజెండరీ హీరో?

the-paradise-mohan-babu-as-villain

నాని ప్రస్తుతం టాలీవుడ్‌లో హ్యాపీ హీరో. ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న నాని, తాజాగా తన నిర్మాణంలో వచ్చిన ‘కోర్ట్’తో మరో బ్లాక్‌బస్టర్ కొట్టాడు. ఇప్పుడు ‘హిట్ 3’ మరియు ‘ది ప్యారడైజ్’ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

నానికి ‘దసరా’ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తోన్న ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్ సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది.

ఇప్పుడీ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ వార్త వినిపిస్తోంది. సీనియర్ నటుడు మోహన్ బాబు ఇందులో విలన్‌గా నటించనున్నారని టాలీవుడ్ టాక్. అయితే, చిత్రయూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

సోనాలీ కులకర్ణి హీరోయిన్‌గా నటిస్తుండగా, చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 మార్చి 26న విడుదల కానుంది. సంగీతాన్ని అనిరుధ్ అందిస్తున్నారు.

ప్రస్తుతం మోహన్ బాబు ‘కన్నప్ప’ సినిమాలో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత మరోసారి విలన్ పాత్రలో కనిపించనున్నారా? అన్న ఉత్కంఠ పెరిగింది. ఈ వార్తపై క్లారిటీ వస్తే, ‘ది ప్యారడైజ్’ సినిమాపై మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉంది!

Read More

One thought on “‘ది ప్యారడైజ్’లో విలన్‌గా టాలీవుడ్ లెజెండరీ హీరో?

Comments are closed.