లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఆరోగ్యం పై నిన్న ఉదయం నుంచి వచ్చిన వార్తలపై క్లారిటీ వచ్చింది. చెన్నై అపోలో హాస్పిటల్‌లో ఆసుపత్రిలో చేర్పించిన రెహ్మాన్ ప్రస్తుతం పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని సమాచారం.
నిన్న ఉదయం అనారోగ్యంగా భావించిన రెహ్మాన్, ఛాతీలో నొప్పి కారణంగా అపోలో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందారు. అయితే తాజాగా అపోలో హాస్పిటల్స్ సీఈఓ డాక్టర్ మధు శశిధర్ ప్రకటన ప్రకారం, రెహ్మాన్ ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉంది, అతనికి ఎలాంటి సమస్యలు లేవు.
ఈ సమాచారం తెలుసుకున్న రెహ్మాన్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవడం, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వడం సంతోషకరమైన విషయం.
ఇటీవల రెహ్మాన్, రామ్ చరణ్ నటిస్తున్న RC16 సినిమాకి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే తెలుగు ప్రేక్షకులను తన సంగీతంతో మైమరపించనున్నారు.

One thought on “ఏఆర్ రెహ్మాన్ ఆరోగ్యం నిలకడగా – అభిమానులకు ఊరట”
Comments are closed.