ఖలేజా, డియర్ కామ్రేడ్‌కి వర్క్ చేస్తే బావుండేదన్న నాగ్ అశ్విన్!

Nag Ashwin on Khaleja and Dear Comrade

సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల శిష్యుడిగా సినీ రంగంలో అడుగుపెట్టిన నాగ్ అశ్విన్, “ఎవడే సుబ్ర‌మణ్యం”తో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత కొంత విరామం తీసుకుని, మధురమైన తారగా పేరొందిన సావిత్రి జీవితకథ ఆధారంగా “మహానటి” చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలసి “కల్కి 2898 ఏ.డి.” వంటి విజన్‌రీ ప్రాజెక్ట్‌ను రూపొందించి బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా తన సృజనాత్మకతను దేశవ్యాప్తంగా చాటుకున్నాడు.

ఇటీవల ఓ కాలేజీ ఈవెంట్‌లో విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడిన నాగ్ అశ్విన్ తన ఆలోచనా విధానం, “కల్కి” వెనుక ఉన్న కృషి గురించి వివరించాడు. అలాగే, త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన “ఖలేజా” గురించి మాట్లాడుతూ, ఆ సినిమాకు ఎడిటర్‌గా వర్క్ చేయడానికి అవకాశం ఉంటే బావుండేదని అభిప్రాయపడ్డాడు. అంతేగాక, “డియర్ కామ్రేడ్” గురించి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పెద్ద విజయాలు సాధించకపోయినా, తనకు మాత్రం ప్రత్యేకంగా నచ్చినవని స్పష్టం చేశాడు.

ఈ సందర్భంగా మరొక ఆసక్తికర విషయం కూడా నాగ్ అశ్విన్ పంచుకున్నాడు. 2008లో తాను రాసుకున్న ఓ కథ “ఇన్సెప్షన్”ను తలపించేదని చెప్పాడు. కొన్ని సందర్భాల్లో దర్శకుల ఆలోచనలతో మరొకరెవరో సినిమాలు చేస్తారని, అలాంటి అనుభవం తానూ ఎదుర్కొన్నానని తెలిపారు. ప్రస్తుతం “కల్కి 2” స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్న నాగ్ అశ్విన్, ఈ ఏడాది చివరి నుంచి ఈ మాస్ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్‌ను సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు.

Read More

One thought on “ఖలేజా, డియర్ కామ్రేడ్‌కి వర్క్ చేస్తే బావుండేదన్న నాగ్ అశ్విన్!

Comments are closed.