సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సిగాచీ అనే రసాయన పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు దుర్మరణం చెందారు. పేలుడుకు కారణంగా ఉత్పత్తి విభాగానికి చెందిన భవనం పూర్తిగా కూలిపోయింది. సమీపంలోని మరో భవనం కూడా ధ్వంసమైంది. మృతుల్లో ఐదుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు మరణించారు. మరికొందరు గాయపడినట్టు సమాచారం.
పేలుడు ప్రభావంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 100 మీటర్ల దూరం వరకు కార్మికులు ఎగిరిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సంఘటనా ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండి భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైంది.
Read More : తెలంగాణ బీజేపీ చీఫ్‌గా రామచందర్‌రావు

One thought on “సంగారెడ్డిలో ఘోర దుర్ఘటన: CM”
Comments are closed.