తెలంగాణలో ఎండలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో వడదెబ్బల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నాలుగు వేర్వేరు ఘటనల్లో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
ములుగు జిల్లా మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామానికి చెందిన బడుగుల పిచ్చయ్య (63) కూలి పనికి వెళ్లిన సమయంలో ఎండ తీవ్రత తట్టుకోలేక అక్కడికక్కడే వడదెబ్బతో మృతి చెందారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పొలంపల్లి నాగయ్యగుంపు గ్రామానికి చెందిన పొడుగు శేషగిరి (35) కూడా వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు.
కొమరంభీం జిల్లా పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన యువ రైతు మానేపల్లి గొంతయ్య (19) పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో వడదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయాడు.
ఇక మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పోతంపల్లి గ్రామానికి చెందిన దుర్గం బాలయ్య (49) కూడా కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఎండలు తట్టుకోలేక మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
వడదెబ్బల నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు దాహం వేయించే సమయంలో బయటకు వెళ్లకూడదని, తప్పనిసరి అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Read More : తెలంగాణలో వర్షాల కబురు

One thought on “తెలంగాణలో వడదెబ్బతో నలుగురు మృతి.”
Comments are closed.