సాయిసూర్య, సురానా కేసులో కీలక మలుపు.

ప్రముఖ సినీ నటుడు, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబును ఈ రోజు (ంఒందయ్ ) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించనుంది. సాయిసూర్య, సురానా గ్రూప్ సంస్థలకు సంబంధించిన ఆర్థిక అక్రమాల కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మహేష్ బాబుకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆయనను విచారణకు పిలవడం జరిగింది.

ఈ కేసులో కొన్ని సంస్థల ద్వారా సినీ ప్రముఖులకు భారీగా డబ్బులు బదిలీ అయినట్లు ఈడీ అనుమానిస్తోంది. గతంలో కూడా మహేష్ బాబుకు చెందిన ఖాతాల్లో నిధులు జమైనట్లు గుర్తించిన ఈడీ అధికారులు, వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యాలపై స్పష్టత కోరనున్నారు. అందులో భాగంగా నేడు మహేష్ బాబును ప్రత్యక్షంగా విచారించనున్నట్లు సమాచారం.

సినీ పరిశ్రమలోని మరో ప్రముఖుడిపై ఈడీ దృష్టి సారించడంతో ఈ వ్యవహారంపై ప్రేక్షక లోకంలో ఉత్కంఠ నెలకొంది. మహేష్ బాబు విచారణ అనంతరం అధికారికంగా స్పందించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈడీ విచారణ నేపథ్యంలో అభిమానులు మహేష్ బాబుకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇంకా వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

Read More : ప్రొడ్యూసర్ : సినిమా వసూళ్ల నుంచి సైనికులకు మద్దతు

One thought on “సాయిసూర్య, సురానా కేసులో కీలక మలుపు.

Comments are closed.