సూట్‌కేసులో 10 ఏళ్ల బాలిక మృతదేహం, స్థానికుల్లో కలకలం.

బెంగళూరు నగర శివార్లలో బుధవారం ఉదయం ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. సుమారు 10 ఏళ్ల వయసున్న ఓ బాలిక మృతదేహం సూట్‌కేసులో లభ్యమవడంతో చందాపుర ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. ఈ అమానవీయ ఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది.

వివరాల్లోకి వెళితే, బెంగళూరు అనేకల్ తాలూకా పరిధిలోని చందాపుర రైల్వే ట్రాక్ సమీపంలో ఓ అనుమానాస్పదమైన సూట్‌కేసును బాటసారులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సూర్యానగర్ పోలీస్ స్టేషన్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సూట్‌కేసును తెరిచి పరిశీలించగా, అందులో బాలిక మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని చూసిన అధికారులు నివ్వెరపోయారు.

బాలికను వేరొకచోట హత్య చేసి, సూట్‌కేసులో పెట్టి ప్రయాణిస్తున్న రైలు నుంచి విసిరివేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించగా, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇక ఈ దారుణ ఘటనపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికావచ్చని పోలీసులు తెలిపారు.

Read More : స్టాక్ మార్కెట్ : సెన్సెక్స్ 410, నిఫ్టీ 129 పాయింట్లు లాభం.

One thought on “సూట్‌కేసులో 10 ఏళ్ల బాలిక మృతదేహం, స్థానికుల్లో కలకలం.

Comments are closed.