తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బీర్ల ధరలను 15% పెంచిన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు లిక్కర్ ధరలను కూడా పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చీప్ లిక్కర్ మినహాయించి, రూ.500 కంటే ఎక్కువ ఉన్న లిక్కర్ బాటిళ్లపై కనీసం 10% పెంపు ఉంటుందని సమాచారం. ఈ పెరుగుదల వల్ల ప్రతి బాటిల్ పై కనీసం రూ.50 పెరిగే అవకాశముందని అంచనా.
అధికారులతో జరిగిన సమీక్ష అనంతరం ధరల పెంపు పై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
Read More : హీరో రాజ్‌తరుణ్ ఇంటి వద్ద జరిగిన కుటుంబ వివాదానికి తాత్కాలిక ముగింపు

One thought on “తెలంగాణలో మద్యం ధరలు పెరగనున్నాయి!”
Comments are closed.