బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
తెలుసుకున్న వివరాల ప్రకారం, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌లపై కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు సోమా భరత్ కుమార్, టి. రవీందర్ రావు పేర్లతో విడుదల చేసిన ప్రకటనలో… “ఎమ్మెల్సీ కవిత ప్రవర్తన, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నందున పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆమెను తక్షణం సస్పెండ్ చేశారు” అని పేర్కొన్నారు.
Read More : కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్ రావుకు హైకోర్టు తాత్కాలిక ఊరట.

One thought on “బీఆర్ఎస్‌లో కలకలం: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సస్పెన్షన్ షాక్”
Comments are closed.