వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు — వారం గడువు కోరిన కేంద్రం

వక్ఫ్‌ చట్టానికి సంబంధించి సుప్రీం కోర్టులో చేపట్టిన విచారణ గురువారం ముగిసింది. ఈ కేసులో పూర్తి స్థాయి వివరణను సమర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో వారం రోజుల గడువు కోరింది. కేంద్ర ప్రభుత్వం వాదనలు సమర్పించేందుకు గడువు కోరిన నేపథ్యంలో సుప్రీం కోర్టు ఈ దరఖాస్తును అంగీకరించింది.

ఈ కేసులో ప్రధానంగా వక్ఫ్‌ ఆస్తుల డీనోటిఫికేషన్‌పై తీవ్ర చర్చ జరిగింది. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వక్ఫ్‌ మరియు వక్ఫ్‌ బై యూజర్‌గా గుర్తించబడిన ఆస్తులపై ఎలాంటి మార్పులు చేయరాదని స్పష్టం చేసింది. అలాగే వక్ఫ్‌ ఆస్తులను డీనోటిఫై చేయకూడదని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇక కేంద్ర ప్రభుత్వం నుండి వారం రోజుల్లో పూర్తి వివరణ అందిన అనంతరం ఈ వ్యవహారంపై మరింత విచారణ కొనసాగనుంది. వక్ఫ్‌ చట్టం సవరణలు, ఆస్తుల పరిరక్షణ, ప్రభుత్వ అధికారుల జోక్యంపై వాదనలు తేల్చే దిశగా సుప్రీం కోర్టు ఈ కేసును మరింత లోతుగా పరిశీలించనుంది.

Read More : ఫాస్టాగ్ అవసరం లేకుండా!