తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు వేగంగా ఇవ్వాలి
తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలను ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న ఏపీ ప్రభుత్వం కేంద్రంతో చర్చించి, తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు త్వరగా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదీ పరివాహకంలో 70% తెలంగాణలో ఉన్నప్పటికీ నీటి కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఏపీ అక్రమ జల తరలింపునకు కట్టడి అవసరం
ఏపీ తనకు కేటాయించిన వాటాకు మించి కృష్ణా నీటిని తరలించడాన్ని సీఎం రేవంత్ తీవ్రంగా విమర్శించారు. పాలమూరు, సీతారామ ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించినప్పటికీ అనుమతులు రావడం లేదని అన్నారు. ఇదే సమయంలో, ఏపీ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర సంస్థల అనుమతులు లేవని గుర్తుచేశారు.
తెలంగాణ హక్కుల పరిరక్షణే లక్ష్యం
తెలంగాణ నీటి హక్కులకు ఎలాంటి రాజీపడబోమని సీఎం స్పష్టం చేశారు. కృష్ణా జలాల సరైన పంపిణీ కోసం కేంద్ర జోక్యం అవసరమని మంత్రి ఉత్తమ్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీలు కూలిన అంశంపై ఎన్డీఎస్‌ఏ విచారణ జరుగుతోందని, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

One thought on “తెలంగాణ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇవ్వండి: సీఎం రేవంత్”
Comments are closed.