బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల అనారోగ్యం కారణంగా చికిత్స పొందిన ఆయన, డాక్టర్ల సూచనల మేరకు మరోసారి వైద్య పరీక్షల కోసం నిన్న ఆసుపత్రికి చేరుకున్నారు.
వైద్య పరీక్షలన్నీ పూర్తి చేసుకున్న అనంతరం డాక్టర్లు ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఆయన సాయంత్రం నందినగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్‌ను ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఆయన భార్య శోభా, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ తదితరులు స్వయంగా తోడుగా ఉన్నారు.
గత వారం అనారోగ్య కారణాలతో ఆయన ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. రెండు రోజుల చికిత్స అనంతరం జూలై 5న డిశ్చార్జ్ అయ్యారు. అయితే, తదుపరి పరీక్షల కోసం వారం తర్వాత మళ్లీ రావాలంటూ డాక్టర్లు సూచించగా, అదే మేరకు నిన్న ఉదయం ఆయన ఆసుపత్రికి వెళ్లారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు కోరుకుంటున్నారు.
Read More : బీసీలకు 42% రిజర్వేషన్‌పై కవిత హర్షం

One thought on “యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్”
Comments are closed.