ఆంధ్రప్రదేశ్‌లో మద్యం మత్తులో యువకుల ఆగడాలు రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. తాజాగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మందు మత్తులో కొందరు యువకులు చేసిన హల్‌చల్ కలకలం రేపింది. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం రామేశ్వరం గ్రామంలో రెండు వర్గాల యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో గాయపడ్డ ఓ యువకుడు చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి (జీజీహెచ్)లో చేరాడు. ఈ విషయం తెలుసుకున్న మరో వర్గానికి చెందిన 15 మంది యువకులు మద్యం మత్తులో ఆసుపత్రికి చేరుకుని, బాధితుడిపై దాడికి దిగారు. ఆసుపత్రి ప్రాంగణం అంతా తిరుగుతూ ఆయనను వెతికి పట్టుకొని తీవ్రంగా దాడి చేశారు.
దీంతో ఆసుపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైద్య సిబ్బంది, రోగులు భయాందోళనకు గురయ్యారు. పరిస్థితిని శాంతపరిచేందుకు వచ్చిన పోలీసులతో యువకులు వాగ్వాదానికి దిగారు.
అయితే చివరికి పోలీసులు మద్యం మత్తులో ఉన్న 15 మంది యువకులను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. ఈ ఘటన రాష్ట్రంలో మద్యం మోత ఎక్కువైపోయిన దృష్టికోణంగా మారింది. ప్రజలు ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Read More : తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ నవీన్ బొల్లినేని ఆత్మహత్య

One thought on “ఏపీలో మితిమీరుతున్న మందుబాబుల హల్‌చల్”
Comments are closed.