తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశం మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు న్యూఢిల్లీ శ్రమశక్తి భవన్‌లో జరగనుంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ అజెండాతో హాజరుకానుంది. బనకచర్ల రిజర్వాయర్ అంశంపై చర్చ జరగాలని ఏపీ కోరుకుంటోంది. మరోవైపు, కృష్ణా నదిపై పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తన అజెండాలో పేర్కొంది. అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పంపిన బనకచర్ల అజెండాపై చర్చ అవసరం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య నీటి ప్రాజెక్టులపై కేంద్రం సమన్వయానికి ప్రయత్నిస్తున్నదిగా భావిస్తున్నారు. ఈ భేటీ ప్రాజెక్టుల భవితవ్యంపై కీలకంగా మారనుంది.
Read More : పల్నాడు జిల్లాలో హృదయవిదారక ఘటన

One thought on “బనకచర్లపై ఏపీ, ప్రాజెక్టులపై తెలంగాణ అజెండా”
Comments are closed.