బీజేపీ నేతల అరెస్టులపై నేతల ఆగ్రహం

జీహెచ్‌ఎంసీ సమస్యల పరిష్కారం కోసం సచివాలయాన్ని ముట్టడించాలని బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును మొయినాబాద్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. చేవెళ్లలో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఆయనను అరెస్టు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్‌ఎస్ బాటలోనే నడుస్తోందని విమర్శించారు. అరెస్టులతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. రాంచందర్ రావుతో పాటు పార్టీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా ఈ అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చేయాల్సింది అరెస్టులు కాదని, ప్రజల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. నిరంకుశ పాలనను కొనసాగిస్తే ప్రజాక్షేత్రంలో గట్టి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

Read More : కాళేశ్వరం నివేదికపై కేసీఆర్-హరీష్‌రావు పిటిషన్ల విచారణ వాయిదా

One thought on “బీజేపీ నేతల అరెస్టులపై నేతల ఆగ్రహం

Comments are closed.