తెలంగాణలో 1623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 1623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టుల వివరాలు:

  • తెలంగాణ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్: 1616 పోస్టులు
  • ఆర్టీసీ హాస్పిటల్: 7 పోస్టులు

దరఖాస్తు గడువు:
ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టుల భర్తీతో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లోని ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత తీరనుంది. జిల్లా, ఏరియా హాస్పిటల్స్‌తో పాటు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలు మరింత మెరుగుపడనున్నాయి. ముఖ్యంగా పల్లెలకు కూడా స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఆరోగ్యశాఖలో ప్రభుత్వం ఇప్పటికే సుమారు 8 వేల పోస్టులను భర్తీ చేయగా, మరో 7 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో వైద్య సేవలు మరింత బలోపేతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Read More : బీజేపీ నేతల అరెస్టులపై నేతల ఆగ్రహం