రెండు లక్షల ఏఐ ఇంజినీర్లు తయారు చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు

AI

భవిష్యత్తు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగానే సాగనుందని, ఈ రంగంలో తెలంగాణ కీలక పాత్ర పోషించనుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాష్ట్ర యువతను ఏఐ రంగంలో నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో రెండు లక్షల మంది ఏఐ ఇంజినీర్లను తయారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ నేతృత్వంలోని ప్రతినిధులు ఈ రోజు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఐటీ మరియు పరిశ్రమల రంగ అభివృద్ధి చర్యలను వారికి వివరించారు.

తెలంగాణను ఎమర్జింగ్ టెక్నాలజీస్‌కు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తుండటం గర్వకారణమని మంత్రి అన్నారు. ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వంటి అంతర్జాతీయ ప్రమాణాల ప్రాజెక్టుల ద్వారా యువతకు అధునాతన శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు.

గత ఏడాదిలోనే రాష్ట్రంలో ఐటీ, హాస్పిటాలిటీతో పాటు ఇతర రంగాల్లో 70 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs) ఏర్పాటు కావడం కీలక పురోగతిగా పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనను కేవలం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం చేయకుండా, కరీంనగర్, వరంగల్ వంటి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నామని తెలిపారు.

స్కిల్ డెవలప్‌మెంట్, టెక్నాలజీ రంగాల్లో సింగపూర్ ప్రభుత్వంతో భాగస్వామ్యంగా పనిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

Read More : తెలంగాణకు బీజేపీ నిధుల పంపిణీ శూన్యం.

One thought on “రెండు లక్షల ఏఐ ఇంజినీర్లు తయారు చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు

Comments are closed.