దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల జీఎస్‌డీపీ (Gross State Domestic Product) వృద్ధి రేటులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నివేదికలో తెలంగాణ రాష్ట్రానికి ఎదురుదెబ్బతగిలినట్లు తెలుస్తోంది. గతంలో 7.4 శాతంగా ఉన్న రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధి రేటు, ఇటీవల 6.79 శాతానికి తగ్గిపోయింది.
ఈ క్రమంలో తెలంగాణ 13వ స్థానానికి జారిపోయింది. తలసరి ఆదాయం వృద్ధి రేటు పరంగా చూస్తే కూడా రాష్ట్రం 11వ స్థానానికి పరిమితమైంది. ఇది రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై అనేక ప్రశ్నలు రేకెత్తిస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక రంగం క్షీణించిందన్న విమర్శలు ఇప్పుడు మరింత ఊపందుకున్నాయి. అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శకులు అంటున్నారు.
తెలంగాణకు అప్పటిదాకా ఉన్న స్థిరమైన ఆర్థిక వృద్ధి గత ఏడాది కాలంగా మందగించినట్లు చెబుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక నిర్వహణను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read More : రెండు లక్షల ఏఐ ఇంజినీర్లు తయారు చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు
