హైదరాబాద్‌లో ఎలీ లిల్లీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభం

గచ్చిబౌలిలో అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ ఎలీ లిల్లీ (Eli Lilly) తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్, ఆంకాలజీ, ఇమ్యూనాలజీ వంటి రంగాలలో ఎలీ లిల్లీ పరిశోధనలు, ఔషధాల తయారీలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ నూతన కేంద్రం ద్వారా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన పరిశోధనలు, ఐటీ సేవలు అందించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా అనేక మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు ముందుకు రావడం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సంకేతమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎలీ లిల్లీ కంపెనీ ఉన్నతాధికారులు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read More : కేసీఆర్ ఎర్రవల్లిలో చండీ యాగం

One thought on “హైదరాబాద్‌లో ఎలీ లిల్లీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభం

Comments are closed.