టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్యకు కార్లపై ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తన గ్యారేజ్‌లో బ్లాక్ మెర్సిడెస్-బెంజ్ G63 AMG, రెడ్ ఫెరారీ 488 GTB వంటి ఎన్నో విలాసవంతమైన కార్లు ఉన్నాయ్. తాజాగా ఆయన పోర్షే 911 GT3 RS స్పోర్ట్స్ కార్‌ను సొంతం చేసుకున్నారు. ఇటీవల తన ఫేవరెట్ కార్‌లో రైడ్ చేస్తూ నాగ చైతన్య హైదరాబాదు వీధుల్లో దర్శనమిచ్చారు.
కారు దగ్గర ఓ గ్రూప్ చిన్నారులు వచ్చి ఆయనను తమ తండేల్ సినిమా చూసినట్టు చెప్పడంతో చైతూ వారితో ముచ్చటిస్తూ వారివి పేర్లు, ఏ క్లాస్‌లో చదువుతున్నారన్న విషయాలు అడిగారు. చివరికి వారితో హాయిగా బై చెప్పి వెళ్తూ కనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైతూ సింప్లిసిటీకి ఫిదా అయిన నెటిజన్లు “సింప్లిసిటీ కా బాప్” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఓ చిన్నారి “అన్న మళ్లీ సండే కలుద్దాం” అన్న మాట అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇక చైతన్య సినిమాల విషయానికొస్తే, ఇటీవల విడుదలైన తండేల్ మూవీ సూపర్ హిట్‌గా నిలిచి రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండా దర్శకత్వంలో కొత్త సినిమా చేయనున్నారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, ఇది మిస్టిక్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. మరోవైపు తన 25వ చిత్రం కిషోర్ అనే నూతన దర్శకుడితో చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ప్రత్యేకమైన సెట్లు కూడా వేస్తున్నారట.

One thought on “పోర్షే కార్ లో చైతూ.. పిల్లలతో హార్ట్ టచింగ్ మోమెంట్!”
Comments are closed.