సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాలు కూడా ప్రేక్షకుల అంచనాలు పెంచుకోవడానికి కష్టపడుతున్న ఈ రోజుల్లో, ఓ చిన్న సినిమా ఇంకా టీజర్ విడుదల కాకముందే సంచలనాన్ని సృష్టిస్తోంది. అదే తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్-ఫాంటసీ చిత్రం ‘మిరాయ్’.
ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఇప్పటివరకు ‘మిరాయ్’ కోసం 25,000కి పైగా ప్రేక్షకులు బుక్ మై షోలో ఆసక్తి వ్యక్తం చేశారు. ఇది సినిమాకు ఇంకా కొన్ని నెలల సమయం ఉండగానే వచ్చిన విశేష స్పందన.
‘హనుమాన్’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన తేజ సజ్జా ఈ చిత్రంలో ‘సూపర్ యోధా’ పాత్రలో కనిపించనున్నాడు. టైటిల్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచే ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతూ వస్తోంది. స్టార్ హీరోల సినిమాలు కూడా ప్రచారంతో హైప్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే, ‘మిరాయ్’ మాత్రం కేవలం తన వినూత్నమైన కాన్సెప్ట్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించగలిగింది.
ఇప్పుడు మంచి కథ ఉన్న చిత్రాలు, స్టార్ పవర్ కంటే ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. ‘హనుమాన్’ తో కొత్త రికార్డులు సృష్టించిన తేజ సజ్జా, ‘మిరాయ్’ తో మరోసారి అదే మ్యాజిక్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. టీజర్ అంచనాలను అందుకుంటే, ఇది ‘రాజా సాబ్’, ‘వార్ 2’ వంటి భారీ చిత్రాలతో పాటు 2025లో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఇక టీజర్ విడుదల కోసం సినీ ప్రేమికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు!

One thought on “2025లో ‘సైలెంట్ స్ట్రోమ్’గా మారనున్న తేజ సజ్జా ‘మిరాయ్’?”
Comments are closed.